ఇంజినీరింగ్ చివరి ఏదాది పరీక్షలు వాయిదా!
ఈనాడు, హైదరాబాద్: బీటెక్స్ బీఫార్మసీ చివరి ఏడాది పరీక్షలు వాయిదా వేయాలని జేఎన్‌టీయూ-హెచ్ నిర్ణయించింది. వాస్తవానికి వచ్చే నెల 14 నుంచి ఆన్‌లైన్ విధానంలో పరీక్షల నిర్వహణకు గతంలో నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం కొవిడ్ రెండో దశ ఉద్ధృతి తగ్గుతుండటంతో... జులైలో ఇంటర్ రెండో ఏడాది పరీక్షలు జరిపేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఈ పరిస్థితుల దృష్ట్యా ఇంజినీరింగ్ పరీక్షలు సైతం ఆన్‌లైన్‌లో కంటే భౌతికంగా నిర్వహిస్తేనే మేలని అధికారులు నిర్ణయించారు. ఈ విషయమై శనివారం వర్సిటీ రిజిస్టార్ మంజూర్‌హు స్సేన్స్ పరీక్షల విభాగం సంచాలకుడు కామాక్షిప్రసాద్, ఇతర ఆచార్యులతో... ఉపకులపతి ప్రా.కట్టా నర్సింహారెడ్డి
ఫీజు గడువు పొడిగింవు?
పరీక్ష ఫీజు గడువు ఆలస్య రుసుం లేకుండా ఈ నెల 28తో ముగిసింది. తాజాగా పరీక్షలు వాయిదా పడనున్న నేపథ్యంలో దీన్ని పొడిగించే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. దీనిపై సోమవారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆలస్య రుసుం లేకుండా ఫీజు చెల్లింపును మరో రెండు, మూడు రోజులు పొడిగించాలని భావిస్తున్నారు. సమావేశమై చర్చించారు. ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించడం అంత శ్రేయస్కరం కాదన్న అభిప్రాయం వ్యక్తమైంది. మహారాష్ట్రలోని ఓ యూనివర్సిటీ ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించి కాపీయింగ్‌ను నియంత్రించలేక... 98 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులవ్వడంపై వివాదం రేగింది.
ముందుగా ప్రాజెక్ట్ వైవా నిర్వహణ
చివరి ఏడాదిలో బీటెక్‌లో మూడు సబ్జెక్టులు, బీఫార్మసీలో నాలుగు సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించాలి. జూన్ నెలాఖరు లేదా జులైలో నిర్వహించినా ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. ఈలోపు విద్యార్థులకు ప్రాజెక్ట్ వైవా నిర్వహించనున్నారు. ఇంజినీరింగ్ చివరి ఏడాది పరీక్షలు ఇప్పటికిప్పుడు ఆన్‌లైన్‌లో నిర్వహించడం అంతమంచిది కాదని భావిస్తున్నాం. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 14నుంచి పరీక్షలు దాదాపుగా ఉండవని ఉపకులపతి ఈనాడుకు తెలిపారు.
Source : Eenadu epaper 30th May 2021 - Greater Hyderabad Edition - Page No 5
source https://results.universityupdates.in/2021/05/article-in-news-paper-regarding.html